
వేదపరీక్షలు.. జ్ఞాన వేదికలు
వేములవాడ: ప్రాచీన భారతీయ విద్యా సంప్రదాయానికి జీవం పోసేలా వేదాల్లో నిపుణులైన పండితుల స్మార్త పరీక్షలు వేములవాడ రాజన్న క్షేత్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు పేర్కొన్నారు. శుక్రవారం నాలుగు వేదాలకు సంబంధించిన ఈ స్మార్తపరీక్షల కోసం దేశం నలుమూలల నుంచి వేదపండితులు, విద్యార్థులు హాజరయ్యారు. పూర్వ శిష్టాచారాలను అనుసరించి, వేదభాష్యాలు, స్మృతిగ్రంథాలు, ధర్మశాస్త్ర అంశాల్లో శిక్షణ పొందిన వేదవిద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించేలా ఈ కార్యక్రమం కొనసాగింది. వేద భాష్య పండితులు, అధ్యాపకులు సమగ్రంగా పరీక్షించి విద్యార్థుల విజ్ఞానాన్ని అంచనా వేస్తున్నారు. వేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో స్ఫూర్తిదాయక వేదికను రాజన్న ఆలయంలో ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలకు ప్రాచీన భారతీయ విజ్ఞాన సంపదను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని ఓపెన్‌స్లాబ్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా మండపంలో వేదవిద్యార్థులు గురువుల సమక్షంలో తమ జ్ఞానాన్ని ప్రదర్శించారు.
వేములవాడలో స్మార్తపరీక్షలు
హాజరైన పండితులు, అభ్యర్థులు

వేదపరీక్షలు.. జ్ఞాన వేదికలు