
ప్రైవేట్ పాఠశాల బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
సైదాపూర్: ప్రైవేట్ వద్దు.. గవర్నమెంట్ బడి ముద్దు అంటూ గ్రామానికి వచ్చిన ప్రైవేట్ బడి బస్సులను శుక్రవారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దుద్దెనపల్లిలో బొమ్మనపల్లి, హుజూరాబాద్, తుమ్మనపల్లి నుంచి వచ్చిన ప్రైవేట్ బడి బస్సులను మాజీ ఎంపీటీసీ చాడ చైతన్య, కొండాల్‌రెడ్డి, చిన్న వెంకటేశం ఆధ్వర్యంలో గ్రామ మహిళలు అడ్డుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల మాయాజాలంలో ప్రభుత్వ బడులు మూతపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాలమైన పాఠశాల తరగతి గదులు, మైదానం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులుండగా.. రూ.లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ బడికి పంపాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రైవేట్ బస్సులు గ్రామానికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రైవేట్ బడికి వెళ్తున్న విద్యార్థులను సర్కార్ బడిలో చేర్పించారు.

ప్రైవేట్ పాఠశాల బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు