
గ్రామపంచాయతీ గదికి తాళం
ఓదెల(పెద్దపల్లి): అద్దె చెల్లించడం లేదనే కారణంతో హరిపురం గ్రామ పంచాయతీ గదికి యజమాని తాళం వేశారు. దీంతో సోమవారం పంచాయతీ కార్యదర్శితోపాటు సిబ్బంది ఆరుబయటనే విధు లు నిర్వహించారు. గ్రామ పంచాయతీ పక్కాభవన నిర్మాణానికి పదేళ్లక్రితం శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి పంచాయతీ కార్యకలాపాలు అద్దెగదిలోనే కొనసాగిస్తున్నారు. ప్రతీనెల రూ.800 చొప్పు న అద్దె చెల్లించేందుకు యజమానితో ఒప్పందం కుదిరింది. అయితే, రెండేళ్లకు సంబంధించి రూ.20వేల అద్దె బాకీ ఉండిపోయింది. అద్దె చెల్లించకపోవడంతో యజమాని ప్రభాకర్‌రెడ్డి పంచాయతీ గదికి తాళం వేశాడు.