ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Jul 2 2025 6:45 AM | Updated on Jul 2 2025 6:45 AM

ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం మోరపల్లికి చెందిన మర్రిపల్లి హన్మండ్లు (85) మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హన్మండ్లు కొద్దిరోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్నాడు. హన్మండ్లు భార్య దుబ్బరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై సదాకర్‌ తెలిపారు. హన్మండ్లు కుమారులు ఇద్దరు దుబాయ్‌లో ఉన్నారు. వారు బుధవారం స్వగ్రామానికి చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహిస్తారని బంధువులు తెలిపారు.

అప్పులు తీర్చే మార్గం కానరాక..

మల్యాల: ఓ వైపు అనారోగ్యం.. మరోవైపు వైద్యానికి చేసిన అప్పులు.. వాటిని తీర్చే మార్గం కానరాక ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మద్దుట్లలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లూరి తిరుపతి(59) ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. సెప్టిక్‌ కావడంతో వైద్యానికి చాలా డబ్బులు ఖర్చయ్యాయి. కుటుంబ అవసరాలకు కూడా అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం కానరాక మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి భార్య దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

శతాధిక వృద్ధురాలు మృతి

చందుర్తి (వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గసికంటి రాజవ్వ ఉరఫ్‌ ధర్మారం రాజవ్వ(110) మంగళవారం మృతిచెందింది. రాజవ్వకు నలుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు సంతానం. నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు పదేళ్లక్రితం మృతిచెందారు. చిన్న కుమార్తె పోశవ్వ తల్లితోనే ఉంటూ బాగోగులు చూసుకుంటోంది. సోమవారం సాయంత్రం వరకు తన పనులు చేసుకున్న రాజవ్వ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి జారుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి చితికి చిన్నకూతురు నిప్పు పెట్టడాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కంటతడి పెట్టారు.

పోక్సో కేసులో పదేళ్ల జైలు

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): పోక్సో కేసులో షేక్‌ అన్వర్‌(25)కు పదేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ జడ్జి సునీత తీర్పు ఇచ్చినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన కథనం.. 2018లో బాధితురాలిని ప్రేమిస్తున్నాని నమ్మించి ఇంటినుంచి తీసుకెళ్లాడు. ఆ తర్వాత లైంగికంగా లోబర్చుకొని వదిలేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రాజేశ్‌.. నిందితుడు అన్వర్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి.. నేరం రుజువు కావడంతో షేక్‌ అన్వర్‌కు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. నేరం రుజువయ్యేందుకు తగిన సాక్ష్యాలను ప్రవేశపెట్టిన పోలీసులను సీఐ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement