
డాక్టర్ భూంరెడ్డికి నివాళి
కరీంనగర్‌కార్పొరేషన్/కరీంనగర్: ప్రముఖ వైద్యుడు డాక్టర్ భూంరెడ్డికి మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డిలు వేర్వేరుగా నివాళి అర్పించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల పేదలకు వైద్య సేవలందించిన ప్రముఖ వైద్యుడు భూంరెడ్డి మరణం బాధాకరమని అన్నారు. భూంరెడ్డి ఎంఎస్ చదువుతున్న రోజుల్లోనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఢిల్లీలో గోల్డ్‌మెడల్ తీసుకున్నాడని గుర్తు చేశారు.

డాక్టర్ భూంరెడ్డికి నివాళి