
ఘనంగా మహా లింగార్చన
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రుద్ర నమకం, మాన్య సూక్తం, లక్ష్మీసూక్తం, పురుష సూక్తం తదితర పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఒక్కరోజు ఆదాయం రూ 3.70లక్షలు
శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే వివిధ రకాల సేవల ద్వారా రూ.3,70,801 ఆదాయం సమకూరింది.