
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
చిగురుమామిడి: చిగురుమామిడి డీసీఎంఎస్ ఎరువుల దుకాణంలో ఆదివారం రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. చాలామంది రైతులు విత్తనాలకోసం ఉదయమే వచ్చి క్యూ లైన్‌లో నిల్చున్నారు. విత్తనాలు దొరకపోవడంతో వెనుదిరిగారు. గత రెండు విడతలుగా 80 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వచ్చాయి. వాటిని వ్యవసాయశాఖ అధికారులు 260మంది రైతులకు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి ఒక బ్యాగు చొప్పున అందించారు. సబ్సిడీ పోను బ్యాగు ధర రూ.1116 ఉండగా.. చాలా మంది రైతులు తమకు విత్తనాలు అందలేదని వాపోయారు. 100 క్వింటాళ్ల విత్తనాలు తెప్పిస్తే సరిపోతుందని తెలిపారు.
మన సంస్కృతిని రక్షించుకోవాలి
విద్యానగర్: మన సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మారోజు స్వర్ణలత అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మన దేశ సనాతన ధర్మం గొప్పదన్నారు. శాస్త్ర, సాంకేతికతలను అందిపుచ్చుకుంటూనే మన సంస్కృతిని రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వేములవాడ ద్రోణాచారి, అధ్యక్షుడు కట్ట విష్ణువర్దన్, ప్రధాన కార్యదర్శి గజ్జెల హరిహరాచారి, ఉపాధ్యక్షుడు గద్దె సత్యనారాయణ, కోశాధికారి యాస్వాడ అంజయ్య, సంయుక్త కార్యదర్శి బండ్ల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు
కరీంనగర్‌స్పోర్ట్స్: గోవాలో ఈనెల 25, 26 తేదీల్లో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన దమ్మికా కాయ్ షిటోరియో కరాటే అకాడమీకి చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించినట్లు అకాడమీ చీఫ్ ఆర్.ప్రసన్న కృష్ణ తెలిపారు. అండర్ 14 కేటగిరీలో కుముటీ, కటాస్ విభాగంలో పాల్గొన్న మధు, ఆదిత్యసాయి(బంగారు), శ్రితిక్ చందన్, శ్రీచరణ్, మణితేజ(రజత) పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. పతకాలు సాధించిన చిన్నారులను సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంతోశ్, కోచ్ వినోద్ అభినందించారు.
బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ బధిరుల(చెవిటి)ఆశ్రమ పాఠశాలలో 2024–25 విద్యా సంవత్సర ప్రవేశాలకు బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో, 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు ఉన్న బాలబాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలోని బధిర బాలబాలికలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉచిత విద్య, భోజన సదుపాయాలతో పాటు పాఠ్య, నోట్‌బుక్స్, ఏకరూప దుస్తులు అందిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వా రు సదరం ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డు, టీ సీ, రెండు ఫొటోలతో కరీంనగర్‌లోని మ ల్కాపూర్ రహదారి శాతవాహన విశ్వవిద్యాలయం సమీపంలోని పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 90002 21301, 9000013639, 9666868755, 9491476253 నంబర్లను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు

రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు