
జూబ్లీనగర్‌లో సమావేశమైన అధికారులు
కరీంనగర్‌రూరల్: కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు కరీంనగర్ మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభ నిర్వహించారు. జూబ్లీనగర్‌లో జరిగిన సభలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కె.నిర్మల, డాక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పిల్లలు, తల్లులు సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతీ శుక్రవారం సభ నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, ఎంపీడీవో సంజీవరావు, పంచాయతీ కార్యదర్శి కిరణ్‌రావు, అంగన్‌వాడీ టీచరు స్వరూపరాణి, ఏఎన్‌ఎం సుగుణ, ఆశావర్కర్ వసంత తదితరులు పాల్గొన్నారు.