
మంత్రి గంగులను సన్మానిస్తున్న కళాకారులు
● మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్/విద్యానగర్: తెలంగాణ సాధనలో కవులు, కళాకారుల పాత్ర గొప్పదని, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత పాటదేనని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని సీతారాంపుర్ పీఎం కన్వెన్షన్‌లో తెలంగాణ డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాన్స్ స్పోర్ట్స్ వర్క్‌షాప్ ప్రిపరేషన్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం డ్యాన్స్‌ను కళగా కాకుండా క్రీడగా గుర్తించిందని, డ్యాన్స్ స్పోర్ట్స్‌కు తెలంగాణ ప్రభుత్వం సైతం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కరీంనగర్‌లో డ్యాన్స్ అకాడమీ బిల్డింగ్‌ను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.డ్యాన్స్ అకాడమీ భవనానికి వారం రోజుల్లో భూమిపూజ నిర్వహించుకుందామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం మంత్రిని కళాకారులు సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, తెలంగాణ డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కట్ట రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు రామకృష్ణ, వంగల శ్రీధర్, కృపాధానం, తిప్పర్తి ప్రభు, లింగంపల్లి నాగరాజు, గసికంటి జనార్దన్‌రెడ్డి, మెతుకు హేమలత తదితరులు పాల్గొన్నారు.