
రామస్వామి (ఫైల్)
ఇల్లందకుంట(హుజూరా బాద్): అనా రోగ్యానికి గురైన ఓ వృద్ధుడు జీవితంపై విరక్తి చెంది, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసేడుకు చెందిన భోగం రామస్వామి(60)–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో ఇద్దరికి పెళ్లి వయసు వచ్చిన వివాహం కాకపోవడంతో రామస్వామి బెంగ పెట్టుకున్నాడు. దీనికితోడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రిలు తిరిగిన నయం కాలేదు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి పేర్కొన్నారు.
మంథనిలో
రెండుచోట్ల చోరీ
మంథని: స్థానికంగా నెల రోజుల క్రితమే వరుస దొంగతనాలు జరిగి, భారీగా సొ త్తు అపహరణకు గురైంది. ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ ఘటనల నుంచి తేరుకుంటు న్న క్రమంలో తాజాగా మంగళవారం తె ల్లవారుజామున మంథని పట్టణంలోని వీధుల్లో రెండు చోట్ల దొంగతనం జరి గాయి. పూలే విగ్రహం ఏరియాలో చంద్రకాంత్ జువెల్లరీ షాపును ఇతర పనులు ఉండటంతో యాజమాని వెంకటస్వామి రెండు రోజులు తెరవలేదు. మంగళవారం తీసిచూడగా కౌంటర్ వద్ద సామగ్రి చిందరవందరగా పడి, వెనకవైపు తలుపు కట్ చేసి ఉంది. అనుమానం వచ్చి, దుకాణంలో పరిశీలించగా 36 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షలు కనిపించలేదు. సీసీ ఫుటేజీలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి దొంగతనం చేస్తూ కనిపించాడు. అంతేకాకుండా నడివీధికి చెందిన గంగా జయప్రద 20 రోజుల క్రితం తన కూతురు ఇంటికి వెళ్లింది. మంగళవారం ఆమె ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు బాధితురాలికి సమాచారం ఇచ్చారు. ఆమె ఇంట్లోని 30 తులాల వెండి, మూడు తులాల బంగారు హారం చోరీకి గురయ్యాయని మంథని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. సంఘటన స్థలాలను ఆయనతోపాటు సీఐ సతీశ్ పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.