
పత్తిని పరిశీలిస్తున్న జెడ్పీ సీఈవో ప్రియాంక
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కోనుగోళ్లు భేష్ అని, అధికారుల పనితీరు అభినందనీయమని జెడ్పీ సీఈవో ప్రియాంక, డీఎంవో పద్మావతిలు అన్నారు. మంగళవారం పత్తి మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్‌లో పత్తి క్రయవిక్రయాలను పరిశీలించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, మార్కెట్‌కు వచ్చే ఆదాయం, వ్యయం, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జమ్మికుంట మండలంలో అయిల్‌పామ్ సాగు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై ఆరా తీశారు. జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయని, నూతనంగా సైదాపూర్‌లో మార్కెట్ యార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జమ్మికుంట మార్కెట్ పన్నుల ఆదాయం 2022–23 ఆర్థిక సంవత్సరం అంచనా రూ.22.98 కోట్లు కాగా రూ.22.92 కోట్లకు చేరుకున్నామని చెప్పారు. అనంతరం ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన జెడ్పీ సీఈవోను మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ లక్ష్మణ్, వ్యాపారులు, అడ్తిదారులు తదితరులు పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి ధర రూ.7,350
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పత్తి ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,350 పలికింది. రైతులు 104 వాహనాల్లో 1,651 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకువచ్చారు. క్వింటాల్‌కు మోడల్ ధర రూ.7,300, కనిష్ట ధర రూ.6,800ను వ్యాపారులు చెల్లించారు. గన్నీ సంచుల్లో 19 మంది రైతులు 32 క్వింటాళ్ల పత్తిని తీసుకురాగా క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.7,050, మోడల్ ధర రూ.6,600, కనిష్ట ధర రూ.6,000 చెల్లించి, కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్డి నాయక్ కొనుగోళ్లను పర్యవేక్షించారు.
జెడ్పీ సీఈవో ప్రియాంక, డీఎంవో పద్మావతి
జమ్మికుంట
వ్యవసాయ మార్కెట్ సందర్శన