
నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్‌టౌన్: దేశాన్ని అప్పుల్లో ముంచిపోయిన వారంతా మోదీలేనని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టారు. దేశంలో కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాలు తీసుకొని, చెల్లించకుండా దేశం విడిచి, పారిపోయిన వ్యాపారులందరూ గుజరాత్‌కు చెందినవారేనని ఆరోపించారు. సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు వేయించి, రాజకీయ కుట్రతో రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి బహిష్కరించడం ప్రధాని మోదీ నియంత పాలనకు నిదర్శనమన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోతే, అదానీ మాత్రం అత్యంత సంపన్నునిగా ఎలా ఎదిగాడని ప్రశ్నించారు. దీనిపై జేపీసీ వేయాలని పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కుట్రపూరితంగా ఆయనను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, మడుపు మోహన్, పత్తి కృష్ణారెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, ఎండీ.తాజ్, శ్రవణ్ నాయక్, కర్ర సత్యప్రసన్నరెడ్డి, మేనేని రోహిత్‌రావు, బత్తిని శ్రీనివాస్ గౌడ్, మల్యాల సుజిత్ కుమార్, సయ్యద్ అఖిల్, గడ్డం విలాస్ రెడ్డి, రాచకొండ ప్రభాకర్, నాగి శేఖర్, మామిడి అనిల్, ఎస్.ఎల్ గౌడ్ పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు
కవ్వంపల్లి సత్యనారాయణ