
మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న మంత్రి కమలాకర్
హుజూరాబాద్‌రూరల్: పద్మశాలీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా జమ్మికుంట పట్టణానికి చెందిన గాజెంగి అఖిల్‌ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం హుజూరాబాద్‌లో జరిగిన పద్మశాలీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల పైచిలుకు ఉన్న పద్మశాలీల స్థితిగతులను మార్చాలంటే రాజకీయ ప్రాతినిధ్యం వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం పద్మశాలీ కులస్తులను ఏకం చేయాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన పద్మశాలీ సంఘం సీనియర్ నాయకులు సంగెం సత్యనారాయణ, బండారి సదానందం, శ్రీనివాస్ తదితరులకు అఖిల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీ బండి సంజయ్ అత్తమ్మ మృతి
కరీంనగర్‌టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అత్తమ్మ వనజ సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై.సునీల్‌రావు, బీజేపీ నాయకులు వనజ పార్థివదేహానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. అనంతరం ఎంపీ కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఉచిత వైఫైకి
ఆదిలోనే ఆటంకం
● బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదంతో సేవలకు బ్రేక్
కరీంనగర్ అర్బన్: అధికారులు, ఉద్యోగులు, ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వైఫైకి ఆదిలోనే ఆటంకం కలిగింది. పరికరాలు బిగించినా సేవలు అందడం లేదు. ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. దీంతో వైఫై సేవలకు కూడా బ్రేక్ పడింది. స్మార్ట్ సిటీలో భాగంగా కలెక్టరేట్‌లో నాలుగు వైఫై పరికరాలను అమర్చారు. ఇందులో రెండు అధికారులు, ఉద్యోగుల కోసం కాగా మరో రెండు ప్రజల కోసం ఏర్పాటు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో మరమ్మతుల అనంతరం వైఫై సేవలు ప్రారంభమవుతాయని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

నియామక పత్రం అందిస్తున్న నాయకులు

కలెక్టరేట్‌లో వైఫై పరికరం