ఇందల్వాయి: హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణ, నిర్ణీత వేగం, ట్రాఫిక్ నియమాలు పాటించడం నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని డీజీపీ బి శివధర్‌రెడ్డి సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా చంద్రయాన్‌పల్లి గ్రామం వద్ద మంగళవారం నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా 44వ నంబరు జాతీయ రహదారిపై వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ (వీఐడీఎస్)ను ప్రారంభించారు. వీఐడీఎస్ వ్యవస్థ మానవ ప్రమేయం లేకుండా ఏఐ విశ్లేషణతో కూడి అధునాతన కెమెరాలతో పనిచేస్తుందని డీజీపీ వివరించారు. కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజారెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా
నియమాలు పాటించాలి
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్
శివధర్‌రెడ్డి
ఎన్‌హెచ్ 44పై వీఐడీఎస్ ప్రారంభం


