డీజీపీకి సన్మానం | - | Sakshi
Sakshi News home page

డీజీపీకి సన్మానం

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

డీజీపీకి సన్మానం శ్రీవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు నాయీ బ్రాహ్మణ కార్యవర్గం అయ్యప్ప జన్మదినం.. అన్నదానం గ్యాస్‌ కష్టాలు ఎన్నడు తీరేనో..?

భిక్కనూరు: డీజీపీ శివధర్‌రెడ్డిని భిక్కనూరు మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుంట లింగారెడ్డి మంగళవారం సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌ రెడ్డి, సీనియర్‌ నేత అంకం రాజు పాల్గొన్నారు.

గోల్డెన్‌ అవర్‌ ప్రాణదాతకు..

కామారెడ్డి అర్బన్‌: రోడ్డు ప్రమాదాల్లో తొలి గంట గోల్డెన్‌ అవర్‌లో స్పందించి పలువురి ప్రాణాలు కాపాడిన సదాశివనగర్‌కు చెందిన వంకాయల రవిని డీజీపీ శివధర్‌ రెడ్డి సన్మానించారు. వంకాయల రవి రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే 108 ద్వారా వెంటనే ఆస్పత్రికి తరలించడం, సీపీఆర్‌ చేయడం ద్వారా 50 మంది ప్రాణాలు కాపాడటంలో విశేష కృషి చేశారని పోలీసులు ప్రశంసించారు.

దళిత రత్న అవార్డు గ్రహీతకు..

కామారెడ్డి రూరల్‌: దేవునిపల్లి గ్రామానికి చెందిన హోలియ దాసరి, అబ్బినబోయిన చిన్న పోశయ్యలు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ చేతుల మీదుగా దళిత రత్న అవార్డు పొందడంతో మంగళవారం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పోశయ్యను స్థానిక కౌన్సిలర్లు వినోద, కాసర్ల మాధవిలు ఘనంగా సన్మానించారు. అంబేద్కర్‌ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలుపొందాలని స్వామి వారిని వేడుకున్నట్లు మల్లికార్జున్‌ తెలిపారు.

భిక్కనూరు: భిక్కనూరు నాయీ బ్రాహ్మణ సంఘం కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాగన్నగారి గోపాల్‌, డైరెక్టర్లుగా కొత్తపల్లి మల్లేశం, సాయన్నగారి బాల నర్సింలు, వెంకమ్మగారి చిన్న బస్వయ్య, చింతకింది స్వామి ఎన్నికయ్యారు.

మద్నూర్‌(జుక్కల్‌): మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ వద్ద గల హనుమాన్‌ ఆలయంలో మంగళవారం శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు పీట పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప జన్మదినం సందర్భంగా మద్నూర్‌ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

మద్నూర్‌(జుక్కల్‌): వంట గ్యాస్‌ కష్టాలు రోజురోజుకి పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ లేకపోవడంతో వారం రోజులకు ఒకసారి బోధన్‌ నుంచి ఆటోలో గ్యాస్‌ బుడ్డీలు వస్తున్నాయని.. అదీ సమయానికి రాకపోవడంతో ఎండలో పరేషాన్‌ అవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి మాత్రమే గ్యాస్‌ దొరుకుతోందని మిగిలిన వారికి వచ్చే వారం ఇస్తామని వారు చెబుతున్నారని వినియోగదారులు పేర్కొన్నారు. గ్యాస్‌ కొరత కారణంగా వినియోగదారులు గంటల తరబడి క్యూ కడుతున్నారు. మద్నూర్‌ లేదా డోంగ్లీ మండలంలో హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే కష్టాలు తీరుతాయని ప్రజలు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement