ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Jan 20 2026 9:16 AM | Updated on Jan 20 2026 9:16 AM

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

ప్రజావాణికి 75 వినతులు

కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 75 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్‌ కార్డులు, పింఛన్‌లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు లాంటి ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. సమస్యలను పరిష్కరించాలి లేదా పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. బాన్సువాడ సబ్‌కలెక్టర్‌ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్‌, మధు మోహన్‌, కలెక్టరేట్‌ పాలనాధికారి మసూర్‌ అహ్మద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement