అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నారు
● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మద్నూర్(జుక్కల్) : సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో జుక్కల్‌లో పరుగులు పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంచి ఆశయం, పట్టుదలతో పార్టీలో చేరుతున్న వారిని చేరదీసి వారికి సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని ఆయన అన్నా రు. మండల కేంద్రంలో గురు ఫంక్షన్ హాల్‌లో సో మవారం మండల బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ జిల్లా నాయకుడు రౌత్‌వార్ కృష్ణపటేల్, తులావార్ సంతోష్, ఇండిపెండెంట్‌లుగా గెలుపొందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ నాయకులు పార్టీలో చేరారు. అంతకు ముందు పార్టీలో చేరుతున్న నాయకులు వంద బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, భావజాలం చాలా గొప్పదని కొనియాడారు. డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో యువత చేరడానికి ఆసక్తి కనబరుస్తుండటం శుభపరిణామని అన్నారు. సర్పంచ్ ఉష, పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు, నాయకులు సాయిపటేల్, సంతోష్‌మేసీ్త్ర, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కోరారు. మండల కేంద్రంలో సోమవారం డ్వాక్రా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చీరలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిచ్కుంద పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీని ఏర్పాటు చేసి రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. అదనంగా మరో రూ.10 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపామన్నారు. డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ ఖయ్యూం, నాయకులు షెట్కార్ రాజు, బోగడమీద సాయిలు, గంగాధర్, అసద్‌అలీ, తుకారాం పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నారు


