సమన్వయంతో పనిచేయాలి
కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమస్యలు లేకుండా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులు, ఎన్నికల సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జెడ్పీ పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన సామగ్రిని పోలింగ్ కేంద్రాల వారీగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలను జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు, లోపాలు ఎదురైతే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సందర్శన
రాజంపేట: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ/స్వీకరణ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఎన్నికల నిర్వహణ, నియమాలపై అధికారులకు పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి అపర్ణ, తహసీల్దార్ జానకి, ఎంపీవో ఇమాముద్దీన్, కార్యాలయ సిబ్బంది జనార్దన్‌రెడ్డి, నరే ష్, అనంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.


