మున్సిఫ్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కోర్టు సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ ప్రత్యేక లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోదగ్గ కేసులను పరిష్కరించినట్లు వారు తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్‌లో 164 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. వీటిలో 5 సివిల్, 32 క్రిమినల్, 127 పీటీ కేసులను న్యాయమూర్తి పరిష్కరించినట్లు వారు తెలిపారు. పీటీ, క్రిమినల్ కేసులకు సంబంధించి 2 లక్షల 72 వేల 137 రూపాయలు జరిమానాలు విధించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్‌రావు, పండరి, నవీద్, సాయిప్రకాష్, శ్రీనివాస్, సతీష్, శ్రీకాంత్ తదితరులున్నారు.
కామారెడ్డి అర్బన్: విద్యుత్ వినియోగదారులకు అవసరమైన అన్ని సేవలు టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, వాటాప్స్ నంబర్ 79016 28348 ద్వారా పొందాలని జిల్లా ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గృహ వినియోగదారులతో పాటు రైతులు, పరిశ్రమలున్న వారు ఎలాంటి సమస్యలున్నా ఇబ్బందులు పడొద్దని, అవసరమైనప్పుడు 1912 నంబర్ కాల్ చేయాలని సూచించారు.
ఆర్మూర్: ఆత్మరక్షణ కోసం విద్యార్థులు తైక్వాండో లాంటి క్రీడల్లో శిక్షణ పొందాలని జిల్లా అధ్యక్షుడు ఈరవత్రి రాజశేఖర్ సూచించారు. పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో శనివారం తైక్వాండో పోటీలను నిర్వహించారు. తైక్వాండో గ్రాండ్ మాస్టర్ భోజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోటీల్లో 108 మంది క్రీడాకారులు పాల్గొనగా బెల్టులు సాధించిన వారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. కరాటే కోచ్ రాజు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, కొండి రాంచందర్, టైలర్ వినోద్ పాల్గొన్నారు.
సిరికొండ: చిన్న వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణకు ఇటీవల పితృ వియోగం కలిగిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని పాకాల గ్రామంలో ఉన్న పూర్ణను శనివారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పరామర్శించారు. పూర్ణ తండ్రి దేవిదాస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నాయకులు బాకారం రవి, భాస్కర్‌రెడ్డి, ఎర్రన్న, నరేష్, తదితరులు ఉన్నారు.
మున్సిఫ్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్


