వైభవంగా వీరభద్రుడి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వీరభద్రుడి ఉత్సవాలు

Nov 16 2025 7:21 AM | Updated on Nov 16 2025 7:23 AM

మద్నూర్‌(జుక్కల్‌): ఓం నమః శివాయా.. హర హ ర మహాదేవ్‌.. అంటూ భక్తులు వీరభద్రుడి దండకా ల మధ్య నిప్పు కణికలపై నడిచారు. మూడు రోజులుగా మండల కేంద్రంలో జరుగుతున్న వీరభద్రుడి ఉత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా మండల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి తర్వాత 9వ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు సంగాయప్ప స్వామి తెలిపారు. ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకీ ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. వీరభద్రుని ఉత్సవాల సందర్భంగా దక్ష యజ్ఞం(అగ్నిగుండం) నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులు నిప్పు కణికలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు.

మద్నూర్‌లో పల్లకీ ఊరేగింపు నిర్వహిస్తున్న భక్తులు , అగ్ని గుండంలో నడుస్తున్న భక్తులు

వైభవంగా వీరభద్రుడి ఉత్సవాలు 1
1/1

వైభవంగా వీరభద్రుడి ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement