రాజీ మార్గమే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్
● లోక్ అదాలత్‌లో 409 కేసుల
పరిష్కారం
కామారెడ్డి టౌన్ : రాజీ మార్గమే రాజమార్గమని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్‌ఆర్ వరప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కారం చేసుకోవచ్చని, ఇందుకోసం లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇరు పక్షాలకు న్యాయం జరుగుతుందని, బాధితులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, న్యాయవాదులు శంకర్‌రెడ్డి, సలీం, సిద్ధిరాములు, మురళి, వేణుప్రసాద్, శ్రవణ్‌గౌడ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆరు ప్రత్యేక బెంచీలు..
జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రత్యేక లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసి 409 కేసులను పరిష్కరించారు. ఇందులో పోలీస్ కేసులు 385, ఎన్‌ఐ యాక్ట్ కేసులు రెండు, ఇతర కేసులు 22 ఉన్నాయి.


