సిద్ధరామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
భిక్కనూరు: కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా దక్షిణకాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పండితులు సిద్ధగిరిశర్మ, రామగిరి శర్మ, రాజేశ్వరశర్మ, పూజారి సిద్దేశ్ స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, మాతా భువనేశ్వరి దేవికి కుంకుమ పూజలు, గండదీపం, కోడె మొక్కులు, సత్యనారా యణ వ్రతాలను నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీధర్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ తాటిపాములు లింబాద్రి, డైరెక్టర్లు భక్తులకు సేవలు అందించారు.
17 వరకు రేషన్
బియ్యం పంపిణీ
కామారెడ్డి రూరల్: రేషన్ షాపుల ద్వారా న వంబర్ నెలకు సంబంధించిన ఉచిత బి య్యం పంపిణీ ఈ నెల 17 వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందు గా ఈ నెల 15 చివరి తేదీ అని ప్రకటించినప్పటికీ.. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లను లారీల్లో రైస్ మిల్లులకు తరలించడం కారణంగా రేషన్ షాపులకు బియ్యం సరఫరా ఆ లస్యమైంది. ఈ కారణంగా పంపిణీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో పంపిణీ తేదీని పొడగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రేషన్ బియ్యం తీసుకోని వినియోగదారులు ఎవరైనా ఉంటే సంబంధిత రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు సూచించారు.
రేపటి నుంచి
పత్తి కొనుగోళ్లు బంద్
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని సీ సీఐ, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి బంద్ చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల యజమానులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాటన్‌మిల్లులు, ట్రే డర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ప త్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని పేర్కొన్నా రు. జిల్లాలో ఏకై క కొనుగోలు కేంద్రం ఉన్న మద్నూర్‌కు పత్తి తీసుకురావొద్దని రైతులకు వ్యాపారులు సూచించారు. పత్తి కొనుగోళ్ల లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన ఎల్1, ఎల్2, ఎల్3 ఆంక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రైతులు సహకరించాలని వారు కోరారు.
ఉపాధి కల్పనాధికారిగా కిరణ్‌కుమార్
కామారెడ్డి క్రైం: జిల్లా ఉపాధి కల్పనాధికారి గా కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. ఇటీవలే గ్రూప్–1 సాధించిన కిరణ్ కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిగా నియమితులయ్యారు. శనివారం బాధ్యతలు స్వీకరించి న అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మ ర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇదివరకు ఉపాధి కల్పనాధికారిగా ప నిచేసిన రజినీ కిరణ్ ఆదిలాబాద్ జిల్లాకు బ దిలీపై వెళ్లారు.
20 వరకు పీజీ స్పాట్ అడ్మిషన్లు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 20వ తేదీ వరకు పీజీ స్పాట్ అడ్మిషన్లు పొందొచ్చని ప్రిన్సిపాల్ కే విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంకాం, ఎమ్మెస్సీ బొటనీ, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఫిషరీస్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో విద్యార్థులు సంప్రదించి వెంటనే సీట్లు పొందవచ్చని తెలిపారు.
సిద్ధరామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు


