రైతు రత్న దరఖాస్తు గడువు పొడిగింపు
పాల్గొన్న బీసీ కులాల నాయకులు, కార్యకర్తలు
కామారెడ్డి క్రైం: తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహకారంతో ఎంపిక చేయనున్న రైతు రత్న అవార్డుల దరఖాస్తు గడువును ఈ నెల 18 నుంచి 20వ తేదీకి పొడిగించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుస్థిర, సమీకృత, వి నూత్న వ్యవసాయం, ఉద్యాన పంటల సాగు, సేంద్రియ, స్నేహపూర్వక వ్యవసాయానికి విశి ష్ట సేవలందించిన రైతులు, మహిళా రైతులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారిని హైదరాబాద్‌లోని హార్ట్‌ఫుల్‌నెస్ సెంటర్‌లో డిసెంబర్ 3 నుంచి 5 వరకు జరిగే మహాకిసాన్ మేళాలో భాగంగా అవార్డులతో సత్కరించనున్నామన్నారు.
ఆసక్తి కలిగిన రైతులు మండల వ్యవసాయాధికారులను సంప్రదించి ఈ నెల 20వ తేదీ వరకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు.


