ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నామని జిల్లా ఇంట ర్ విద్యాధికారి(డీఐఈవో) షేక్‌సలాం అన్నారు. నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళా శాలలోని అధ్యాపకుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రిపరేషన్‌లో భా గంగా ఏవైనా సందేహాలోస్తే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూ చించారు.
పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు, అధ్యాపకులకు మంచిపేరును తీసుకురావాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యే క దృష్టి సారించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని అధ్యాపకులకు ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళ ల్లో విద్యార్థులకు స్టడీ అవర్స్ కొనసాగిస్తున్నామని అన్నారు. ఆయనవెంట కళాశాల అధ్యాపకులు ఉన్నారు.


