భద్రత లోపాలు ఉండొద్దు
● టీజీఆర్‌టీసీ సీసీఈ కవిత
సుభాష్‌నగర్: బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రతకు ఎలాంటి లోపాలు ఉండొద్దని టీజీఆర్‌టీసీ కార్పొరేట్ చీఫ్ ఇంజినీర్ (సీసీఈ) కవిత సూచించారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్, ఆర్‌ఎం కార్యాలయంలో ఉన్న భవనాల ను ఆమె శనివారం తనిఖీ చేశారు. భవనాల గోడ లు, పైకప్పులు, డ్రెయినేజీ వ్యవస్థ, ప్రయాణికుల విశ్రాంతి గదులు, టికెట్ కౌంటర్లు తదితర ముఖ్య విభాగాలను ఆమె స్వయంగా పరిశీలించారు. భవ నం పాడైపోయిన చోట్ల వెంటనే పనులు ప్రారంభించేందుకు సంబంధిత విభాగానికి ఆదేశాలు జారీచేశారు. బస్టాండ్‌లో మరమ్మతులు, అత్యవసరంగా చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆమె వెంట నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, కార్యాలయ సిబ్బంది, ఇంజినీరింగ్ వి భాగం అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.


