స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని అర్సపల్లిలో శనివారం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందాడు. ఆరో టౌన్ పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం... నిజామాబాద్ మండలం ధర్మారం(ఎం) గ్రామానికి చెందిన కిషన్(45) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం విద్యార్థులను తీ సుకువచ్చేందుకు పాఠశాల బస్సు అర్సపల్లి వెళ్లింది. ఆటోస్టాండ్ వద్ద బస్సు వెనక్కి తీసుకునే క్రమంలో వెనకాలే ఉన్న కిషన్ బస్సును చూసుకోలేకపోయాడు. డ్రైవర్ సైతం గమనించకపోవడంతో బస్సు కిషన్ ఢీ కొట్టింది. వెనుక టైర్ కిషన్ తల పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


