పుస్తక పఠనం ప్రతిరోజు చేయాలి
కామారెడ్డి అర్బన్ : విద్యార్థులు, యువత ప్ర తిరోజు గ్రంథాలయానికి వచ్చి పుస్తకపఠనం చేయాలని, దీంతో అనుకున్న లక్ష్యాలను చే రుకోవచ్చని అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. ప ట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శు క్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ను వారు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమానికి సంస్థ జిల్లా చైర్మన్ మద్ధి చంద్రకాంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. వారం రోజుల పా టు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి ప్రకటించా రు. జిల్లా గ్రంథాలయ సంస్థకు స్థానిక వ్యాపా రి బాలాజీ రేడియో హౌస యాజమాని మహిపాల్ రోహిత్ జైన్ రూ.50 వేల విలువైన అహుజా సౌండ్ సిస్టంను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.


