రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● జిల్లాకేంద్రంలో ‘కిడ్స్ విత్ ఖాకీ,
సేఫ్ కామారెడ్డి’ కార్యక్రమాల నిర్వహణ
కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరిరు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులతో కలిసి కిడ్స్ విత్ ఖాకీ, సేఫ్ కామారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపడంతో ఓ కుటుంబం ఏవిధంగా సర్వం కోల్పోతుందో, అమాయకులు సైతం ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో నాటిక ప్రదర్శన ద్వారా విద్యార్థులు కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సేఫ్ కామారెడ్డి పోస్టర్లలను కలెక్టర్, ఎస్పీ రాజేష్ చంద్రలు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
డీపీవోను సందర్శించిన విద్యార్థులు
జిల్లా పోలీస్ కార్యాలయం సందర్శనలో భాగంగా విద్యార్థులకు ఫింగర్ ప్రింట్, స్పెషల్ బ్రాంచ్, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వంటి విభాగాల పనితీరుపై సిబ్బంది సమగ్ర అవగాహన కల్పించారు. సైబర్ క్రైౖమ్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. షీటీం, భరోసా కేంద్రం, పోలీస్ కంట్రోల్ రూం పనితీరు, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను తెలియజేశారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి, పేలుడు పదార్థాలు వంటి వాటితోపాటు పల అంశాలను ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. అదనపు ఎస్పీ నర్సింహరెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా నెహ్రూ జయంతి
కామారెడ్డి క్రైం: పట్టణంలోని జిల్లా పోలీసు కా ర్యాలయంలో శుక్రవారం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం


