సీఎంఆర్‌ఎఫ్ చెక్కును చింపేసిన సీడీసీ చైర్మన్
● సోదరి చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చు పెట్టిన ఇర్షాదుద్దీన్
● సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.60 వేలే రావడంతో మనస్తాపం
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును చింపివేసిన ఘటన శుక్రవారం జరిగింది. ఇర్షాద్ సోదరి నేహా బేగం 2024లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో నేహాబేగంకు వైద్యం చేయించేందుకు రూ.32లక్షలు ఖర్చుపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. సోదరి చికిత్స కోసం అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టానని పేర్కొన్నారు. సీఎంఆర్‌ఎఫ్ కింద కనీసం 30 లేదా 40 శాతం వరకు డబ్బులు వస్తాయేమోనని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు. చివరకు కేవలం రూ.60 వేలు రావడంతో మనస్థాపంతో చెక్కును చింపి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంజూరైన రూ.60వేలను ఏ అప్పుల వారికి చెల్లించాలి అని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడిన నాకే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో (యూడైస్ కోడ్ ఉన్న పాఠశాలలు) 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ–పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం వాటిని ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్లకు అందజేయాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేయడానికి కుల ధ్రువీకరణ, ఆదాయ, విద్యార్థి బ్యాంక్ పాస్‌బుక్, బోనఫైడ్, పాస్‌సైజ్ ఫో టో అవసరం అవుతాయని పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు
గడువు పొడిగింపు
కామారెడ్డి టౌన్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీఈవో రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈనెల 20లోపు ఎలాంటి అపరాద రుసుం లేకుండా రూ. 125 పరీక్ష ఫీజును చెల్లించాలన్నారు. రూ.50 అపరాధ రుసుంతో 29 వరకు చెల్లించవచ్చన్నారు. రూ. 200 అపరాధ రుసుముతో డిసెంబర్ 11 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 29వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని పదో తరగతి విద్యా ర్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో అన్నారు.
17న వాహనాల వేలం
కామారెడ్డి అర్బన్: ఎకై ్సజ్ కేసుల్లో పట్టుబడిన పలు వాహనాలను వేలం వేయనున్నట్లు కామారెడ్డి ఎకై ్సజ్ సీఐ సీహెచ్ సంపత్‌కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ శివారులోని నర్సన్నపల్లి వద్ద గల తమ కార్యాలయంలో ఈనెల 17న ఉదయం 11గంటలకు వాహనాలను వేలం వేయనున్నట్టు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే ఆసక్తిగల వారు ముందుగా రూ.5వేలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వేలంపాట వాహనం ధరపై 18శాతం జీఎస్టీ ఉంటుదని గమనించాలని సీఐ వివరించారు.


