ఎన్‌పీఏను తగ్గించడమే ప్రధాన లక్ష్యం
● ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి
సుభాష్‌నగర్ : రాబోయే రికవరీ సీజన్‌లో అన్ని వి ధాలుగా ప్రయత్నించి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్‌పీఏను తగ్గించడమే ప్రధాన లక్ష్యంతో పాలకవర్గం, ఉద్యోగులు ముందుకెళ్తున్నారని ఎన్‌డీసీసీ బీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్‌డీసీ సీబీ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.2,500 కోట్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తంచేశారు. ఈ మైలురాయి చేరుకోవడంలో సహకరించిన సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాంకు మేనేజర్ల తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చైర్మన్ మా ట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు రూ.3,000 కోట్ల వ్యాపార కార్యకలాపాలకు చేరుకోవాలని సూచించారు. ఈ మైలురాయి ప్రతి ఉద్యోగి కి గుర్తుండిపోయేలా జ్ఞాపికలను అందజేస్తామని తె లిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కామధేను డిపాజిట్ ను విరివిగా ప్రచారం చేసి డిపాజిట్లు తీసుకురావా లని పేర్కొన్నారు. బ్యాంకులో ఉన్న అన్ని స్థాయిల ఉద్యోగులు తనకు తానుగా లక్ష్యాలను నిర్దేశించుకొని చేరుకోవాలని సూచించారు. రూ.2,500 కోట్ల మైలురాయి చేరుకోవడంలో ప్రత్యేక భూమిక పో షించి, నిరంతరం సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో విలువైన సూచనలు, బ్యాంకు పటిష్టతకు తీసుకుంటున్న చర్యలకు సీఈవో, ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు లింగయ్య, ఆనంద్, సీఈవో నాగభూషణం వందే, ఉన్నతాధికారులు, 63 శాఖల మేనేజర్లు పాల్గొన్నారు.


