డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
బోధన్‌టౌన్: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఇద్దరికి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్పసాయి జైలు శిక్షను విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ శుక్రవారం తెలిపారు. ఇటీవల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ, బోర్గాం గ్రామానికి చెందిన పోశెట్టి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా పోశెట్టికి మూడు రోజుల, లక్ష్మీనారాయణకు ఏడు రోజుల జైలు శిక్షను విధించారని సీఐ తెలిపారు.
రావుట్లవాసికి ఏడు రోజులు..
ధర్పల్లి: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి మెజిస్ట్రేట్ ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ధర్పల్లి ఎస్సై కల్యాణి శుక్రవారం తెలిపారు. మండల కేంద్రంలో ఈనెల 12న నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన వ్యక్తిని కోర్టులో హాజరుపర్చామన్నారు. మెజిస్ట్రేట్ అతనికి ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సై తెలిపారు.
ఆర్మూర్‌లో నలుగురికి జరిమానా
ఆర్మూర్‌టౌన్: మద్యం సేవించి వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ నలుగురికి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో శుక్రవారం రాత్రి చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. జడ్జి వీరికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
బాల్కొండలో ఇద్దరికి..
బాల్కొండ: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఇద్దరికి ఆర్మూర్ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ శుక్రవారం తెలిపారు. బాల్కొండ పీఎస్ పరిధికి చెందిన పెంటు నర్సయ్య, దినేశ్ ఇటీవల మద్యం మత్తులో పట్టుబడడంతో వారిని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. జడ్జి వీరికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు మద్యం మత్తు సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మోపాల్: మండలంలోని సిర్‌పూర్ గ్రామంలో జంగం గణేశ్ నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఏఎస్సై కే పరమేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఏఎస్సై కథనం ప్రకారం.. గణేశ్ గ్రామంలో పూజారిగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో చార్జింగ్ పెట్టిన ల్యాప్‌టాప్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదంలో రెండు బెడ్లు, ఫర్నీచర్, ల్యాప్‌టాప్, వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఏసీ, దుస్తులు, పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.2.56లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. స్థానికుల సహకారంతో మంటలను నియంత్రించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
భిక్కనూరు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తిరుమల రాజయ్య(75)కు ఐదు నెలల క్రితం కాలుకు గాయమైంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


