సీసీ రోడ్డుకు నిధులు కేటాయించాలి
బీబీపేట: మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయం నుంచి సొసైటీ, ప్రభుత్వాసుపత్రి, తహసీల్ కార్యాలయం వరకు సీసీ రోడ్డుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని సొసైటీ డైరెక్టర్లు వినతి పత్రం అందజేశారు. కార్యాలయాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని, లారీల్లో ధాన్యం, యూరియా తరలించడానికి సైతం ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. అలాగే తాగునీటికి సైతం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. బోరుబావి తవ్వించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే సాను కూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. సొసై టీ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నరేందర్, శ్రీనివాస్, మల్లేశం, కిషన్‌రావు తదితరులు ఉన్నారు.


