చికిత్స కేంద్రం ఏర్పాటు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యసన చికిత్స కేంద్రం ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ ఇన్‌చార్జి బోడ రాజు తెలిపారు. శుక్రవారం పట్టణ సీఐ నరహరిని మర్యాదపూర్వకంగా కలిసారు. కేంద్రం కరపత్రాన్ని అందజేశారు. డ్రగ్స్, ఆల్కహాల్ వ్యసనాల బారినపడిన వ్యక్తులకు ఈ చికిత్స కేంద్రంలో చేర్పించి మానసిక వైద్యులతో ఉచితంగా చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. అలాగే బాధితుల కుటుంబ సభ్యులకు కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు సీఐకి తెలిపారు. బాధితులు ఉంటే కేంద్రానికి పంపించాలని కోరారు.


