విద్యుత్‌షాక్‌తో ఒకరి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో ఓ ఇంటినిర్మాణ పనులు చేస్తున్న ఓ వ్యక్తికి విద్యుత్‌షాక్ తగలడంతో మృతి చెందాడు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పాలిత కుమార్ లహరి(35) రెండేళ్ల క్రితం ఆర్మూర్‌కు వచ్చి మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రాత్రి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న అతనికి భవనంపై ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


