ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఆర్మూర్‌టౌన్: ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. ఆర్మూర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర జూనియర్ కళాశాల, చీమన్‌పల్లి గిరిజన బాలికల జూనియర్ కళాశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయాలన్నారు. విద్యార్థులు అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ప్రయోజకులుగా మారాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉన్నారు.


