శభాష్ పోలీసన్న
రుద్రూర్: మండల కేంద్రంలో వాహనంలో ఫిట్స్ వచ్చి బాధపడుతున్న ఓ వ్యక్తిని వాహనాల తనిఖీ చేపడుతున్న పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం రుద్రూర్ ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపడుతున్న సమయంలో ఆగి ఉన్న ఓ లారీలో డ్రైవర్ ఫిట్స్‌తో ఇబ్బంది పడుతున్నట్టు ఎస్సై గుర్తించారు. వెంటనే 108 వాహనాన్ని రప్పించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫిట్స్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా కృషి చేసిన ఎస్సై తీరును పలువురు అభినందించారు. శభాష్ పోలీస్ అన్న అంటూ పలువురు అభినందనలు తెలిపారు.


