ప్లాస్టిక్ దుష్పరిణామాలపై అవగాహన
కామారెడ్డి అర్బన్: పర్యావరణ మార్పులు, ప్లాస్టిక్ వినియోగం– దుష్పరిణామాలు, ప్ర త్యామ్నాయాలు, దాని ప్రభావం, డెయిరీ రంగంపై వాటి ప్రభావం, రైతులు, డెయిరీ వి ద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలపై శుక్రవారం కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ యూత్ ఎన్విరాన్‌మెంట్ కన్సార్టియం సమన్వయకర్త మణిదీప్ వివిధ అంశాలపై వివరించారు. పేపర్ బ్యాగుల తయారీ విధా నం ప్రదర్శించారు. కళాశాల అసోసియేట్ డీన్ సురేష్ రాథోడ్, అధ్యాపకులు స్వర్ణలత, ఉమా పతి, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాలల చట్టాలపై
అవగాహన ఉండాలి
భిక్కనూరు: బాలల సంరక్షణ, హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నాయయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నపిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించేవిధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నారులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన తల్లిదండ్రులకు బంధువులకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజసేవ దేశ ప్రగతికి కృషిచేయాలన్నారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు. ఎంఈవో రాజ్‌గంగారెడ్డి, ఆర్‌ఐ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: ఎంఎస్ ఆఫ్తమాలజీలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఎస్పీ సంకీర్తన సాధించారు. సంకీర్తన హైదరాబాద్‌లోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో ఎంఎస్ ఆప్తమాలజీ చదువుతోంది. గురువారం వెలువడిన ఎంఎస్ ఆప్తమాలాజీ పీజీ ఫలితాల్లో ఆమె రెండో ర్యాంకు సాధించింది.
ప్లాస్టిక్ దుష్పరిణామాలపై అవగాహన
ప్లాస్టిక్ దుష్పరిణామాలపై అవగాహన


