తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయండి
కామారెడ్డి అర్బన్: తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తమ బంగారు బాల్యాన్ని కోల్పోడం విచారకరమని, వారిని కాపాడుకోవడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, బాధ్యతగా యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పట్టణ సీఐ నరహరి కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధిపై అవగాహన కోసం శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ అహ్మద్, గౌరవ అధ్యక్షుడు వేదప్రకాష్, ప్రతినిధులు చంద్రశేఖర్, గంప ప్రసాద్, వెంకటరమణ, పి.అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): అక్కంపల్లిలో మంగలి ఈశ్వరమ్మ నూతనంగా నిర్మించిన ఇంటిని శుక్రవారం ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి పరిశీలించారు. ఈశ్వరమ్మ ఇంటిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తీరుపై గురువారం పలు దినపత్రికలలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన అక్కంపల్లికి చేరుకొని నూతనంగా నిర్మించిన ఇంటిని పరిశీలించారు. ఇంటినిర్మాణం చేపట్టిన తీరును ఈశ్వరమ్మను అడిగి ఆయన తెలుసుకున్నారు. పూర్తి నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆర్డీవో తెలిపారు. నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో లలితకుమారి, ఆర్‌ఐ మహ్మద్, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య తదితరులున్నారు.
తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయండి


