చట్టాలపై అవగాహన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయచైతన్య సదస్సు నిర్వహించారు. మున్సిఫ్ కోర్టు న్యా యమూర్తి సుష్మ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల హక్కుల గు రించి వివరించారు. సీఐ రాజారెడ్డి, బార్ అసో సియేషన్ అధ్యక్షుడు గోపాల్‌రావు, న్యాయవాదులు సాయిప్రకాష్, పండరి, సతీష్, నవీద్ తదితరులున్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మొక్కజొన్న కొనుగోళ్ల ను డిసెంబర్ 10 కల్లా పూర్తి చేయాలని మా ర్క్‌ఫెడ్ మేనేజర్ శశిధర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో విండో ఆధ్వర్యంలో చేపడుతున్న మొక్కజొన్న కొనుగోళ్లను ఆయన ప రిశీలించారు. మొక్కజొన్నలో తేమ శాతం పరిశీలించిన తర్వాతనే తూకం వేయాలన్నారు. తూ కం చేసిన బస్తాలను వెంటనే తరలించాలన్నారు. విండో చైర్మన్ కమలాకర్ రావు, సీఈవో విఘ్నేశ్ గౌడ్, ఏవో ప్రజాపతి, రైతులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల సందర్భంగా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనంలో శుక్రవారం సాయంత్రం క్యారం పోటీలను జిల్లా అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ ప్రారంభించారు. వారోత్సవాల్లో భాగంగా సీనియర్ సిటిజన్లకు వివిధ పోటీలు, కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఫోరం ప్రతినిధులు పీవీ నర్సింహం, మోహన్‌రెడ్డి, పురుషోత్తం, అంతిరెడ్డి, బాపురావు, రామచంద్రం, భద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
చట్టాలపై అవగాహన


