చదువుతోనే సమాజంలో గుర్తింపు
● కామారెడ్డి ఎమ్మెల్యే
కాటిపల్లి వెంకటరమణారెడ్డి
భిక్కనూరు: చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డీప్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో పాఠశాలకు ఆయన 5 కంప్యూటర్‌లను అందజేయించారు. ఈ సందర్బంగా కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేవీఆర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందన్నారు. ఎంఈవో రాజగంగారెడ్డి, హెచ్‌ఎం ప్రసూనదేవి, ఎన్‌సీసీసీ ప్రథమశ్రేణి అధికారి జి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చేప పిల్లల పంపిణీ
బీబీపేట: ప్రభుత్వం మంజూరు చేసిన వంద శాతం రాయితీతో కూడిన చేప పిల్లలను శుక్రవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి బీబీపేట పెద్ద చెరువులో విడుదల చేశారు. మత్స్య శాఖ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా
రాజంపేట: మండలంలో సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.పొందూర్తిలో శుక్రవారం మాల కుల సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్‌రెడ్డి,ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గంగారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.


