మాక్లూర్‌లో భారీ చోరీ
● రెండు కిలోల వెండి, అర్ధతులం బంగారం,
రూ. 2.50 లక్షల నగదు అపహరణ
మాక్లూర్: మండల కేంద్రంలో శుక్రవారం వేకువ జామున భారీ చోరీ జరిగింది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గూండ్ల పెద్దన్న కొత్త ఇల్లును నిర్మించుకున్నాడు. కొత్త ఇంట్లోనే నివాసం ఉంటున్న అతను పాత ఇంట్లోని వస్తువులు ఇంకా కొత్త ఇంటికి చేర్చలేదు. గురువారం రాత్రి 8 వరకు పాత ఇంట్లోనే ఉన్న అతను తిరిగి కొత్త ఇంటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న అద్ద తులం బంగారం, రూ. 2లక్షల50వేల నగదు, 2 కిలోల వెండి చోరీకి గురైందని పెద్దన్న తెలిపారు. చోరీ విషయం తెలుసుకున్న నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని పరీశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


