సుదర్శన్‌రెడ్డికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

సుదర్శన్‌రెడ్డికి సన్మానం

Nov 14 2025 8:23 AM | Updated on Nov 14 2025 8:23 AM

సుదర్శన్‌రెడ్డికి సన్మానం

సుదర్శన్‌రెడ్డికి సన్మానం

సుదర్శన్‌రెడ్డికి సన్మానం రేపు కలెక్టరేట్‌లో జాబ్‌మేళా పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు రీ సర్వేకు గెజిట్‌ నోటిఫికేషన్‌

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులై తొలిసారి నిజామాబాద్‌కు వచ్చిన బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ సీనియర్‌ నా యకుడు ఏబీ శ్రీనివాస్‌(చిన్నా) గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ కృష్ణార్జునుల మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ కృషి చేస్తున్నారన్నారు. వారికి తోడు అపరచాణక్యుడిగా పేరు న్న సుదర్శన్‌రెడ్డి జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో తన చాతుర్యం చూపిస్తారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ ముజాహిద్‌ అలంఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: హైదరాబాద్‌కు చెందిన ఎక్సిటెల్‌ కంపెనీలో ఉద్యోగాల భర్తీకోసం శనివారం ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం రజనికిరణ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కనీసం ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌ చదివి ఉండి 30 ఏళ్లలోపు వారై ఉండాలని, ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట రెండుసెట్ల బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌, ఫొటోలు తీసుకురావాలని, వివరాలకు 63000 57052, 76719 74009 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎంపికై న వారికి అర్హతల ఆధారంగా నెలకు రూ.13వేల నుంచి రూ.31 వేల వరకు వేతనం ఉంటుందని, హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కామారెడ్డి టౌన్‌: ప్రసిద్ధిగాంచిన యాదగిరిగు ట్ట, స్వర్ణగిరి పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బ స్సులను నడుపనున్నట్లు కామారెడ్డి డిపో మేనేజర్‌ దినేశ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి బస్సు డిపో నుంచి ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నా మని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటలకు బయలుదేరనున్న బస్సు దోమకొండ, బీబీపేట, దుబ్బాక, సిద్దిపేట మీదుగా యాదగిరి గు ట్టకు చేరుతుందని, యాదగిరిగుట్ట నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి స్వర్ణగిరికి 1.30 గంటలకు చేరుకుని అక్కడి నుంచి 3.00 గంటలకు కామారెడ్డికి బయలు దేరుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కామారెడ్డి క్రైం: జిల్లాలో గుర్తించిన 16 గ్రా మాల్లో భూముల రీ సర్వే కోసం గెజిట్‌ నోటి ఫికేషన్‌ విడుదల చేసినట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. భిక్కనూర్‌ మండలం ఇసన్నపల్లి, బస్వా పూర్‌, డోంగ్లీ మండలం ఇల్దేగావ్‌, ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌, గాంధారి మండ లం సీతాయిపల్లి, చెన్నాపూర్‌, బిచ్కుంద మండలం హస్గుల్‌, మద్నూర్‌ మండలం సో మూర్‌, మహ్మద్‌నగర్‌ మండలం కోనంపల్లి, తెల్లాపూర్‌, నార్సాపూర్‌, వెంగలంపల్లి, జు క్కల్‌ మండలం సావర్గావ్‌, పెద్దకొడప్‌ల్‌ మండలం పోచారం, పాల్వంచ మండలం దేవన్‌పల్లి, బీబీపేట మండలం తుజాల్‌పూర్‌ గ్రామాల్లో భూముల రీసర్వే చేయనున్నట్లు వివరించారు. ఆయా భూముల పట్టాదారు లు అధికారులు సమాచారం ఇచ్చినప్పుడు నిర్దేశించిన సమయంలో సర్వేకు హాజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement