సలహాదారే కాదు.. జిల్లాకు మంత్రి!
నిజామాబాద్‌అర్బన్/సుభాష్‌నగర్ : బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారుడే కాదు.. జిల్లాకు మంత్రి కూడా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నా రు. ప్రభుత్వ సలహాదారులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సన్మాన సభను ఏర్పాటు చేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సీనియర్ నాయకుడైన సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలోనే తామంతా పనిచేస్తామన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా జిల్లా కు 20, 21, 22 ప్యాకేజీ తీసుకురావడంతో ఆయన ప్రధానపాత్ర పోషించారన్నారు. ఆరు మాసాలు ప్ర భుత్వం ఉంటే కెనాల్‌లు, ప్యాకేజీలు పూర్తయ్యేవని, ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టులను అటకెక్కించా రని విమర్శించారు. జిల్లాకు 35 ఏళ్ల కల అయిన ఇంజినీరింగ్ కళాశాలను తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు మంజూరు చేశామన్నారు. టెంపుల్ కారిడార్‌లో భాగంగా ధర్మపురి, కొండగట్టు, వేము లవాడ, లింబాద్రి గుట్ట, బాసర వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.370 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. లింబాద్రి గుట్ట, ఆర్మూర్ సిద్ధుల గుట్టలో టూరిజం గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తామని, లింబాద్రి గుట్ట గెస్ట్‌హౌస్ కోసం రూ.4 కోట్లు గురువారమే మంజూ రు చేస్తూ జీవో వచ్చిందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి పార్టీ అని, సంక్షేమం ఇచ్చే పార్టీ అని పేర్కొన్నారు.
ప్రజాసంక్షేమాన్ని విస్మరించారు
బీఆర్‌ఎస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని మరిచి దోచుకున్నారని ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూ రి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. జిల్లాకు అవసరమైన పనులు చేపట్టకుండా బీఆర్‌ఎస్ నాయకులే లబ్ధిపొందారని ఆరోపించారు. దొంగ ఓట్లతో అధి కారంలోకి వచ్చారని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిని విస్మరించిన దద్దమ్మలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకు పంటకు ప్రత్యామ్నాయంగా బోధన్ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. రైతులు కూడా పామాయిల్ పంటను పండించాలని సూచించారు.
సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలోనే పని చేస్తాం..
దేవుడి పేరుతో బీజేపీ నాయకులు
ఓట్లు అడుగుతున్నారు..
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
మహేశ్‌కుమార్ గౌడ్


