పంజా విసురుతున్న చలి
● గాంధారిలో 10.8 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
● జిల్లా అంతటా పెరిగిన చలితీవ్రత
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలితీవ్రత పెరిగింది. జిల్లా అంతటా చలి పెరిగి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చలితీవ్రత పెరిగి మరింత ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట గడపదాటలేని పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం గాంధారిలో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లిలో 11 డిగ్రీలు, పాల్వంచ మండలం ఎల్పుగొండ, బీబీపేట మండల కేంద్రాల్లో 11.1, నస్రుల్లాబాద్, మాచారెడ్డి మండలం లచ్చాపేటలో 11.2, రామారెడ్డి, గాంధారి మండలం రామలక్ష్మణ్‌పల్లిలో 11.4, సర్వాపూర్‌లో 11.5, డోంగ్లీలో 11.6, మద్నూర్ మండలం మేనూర్‌లో 11.8, పాల్వంచ మండలం ఇసాయిపేట, జుక్కల్‌లో 11.9, బీర్కూర్‌లో 12, భిక్కనూరులో 12.4, బిచ్కుంద మండలం పుల్కల్‌లో 12.5, బిచ్కుంద, లింగంపేట, హసన్‌పల్లిలో 12.6, దోమకొండలో 12.7, నాగిరెడ్డిపేట, మహ్మద్‌నగర్‌లో 12.9, బాన్సువాడ మండలం కొల్లూరులో 13.3, కామారెడ్డి మండలం పాతరాజంపేటలో 13.5, పిట్లంలో 13.7, సదాశివనగర్‌లో 13.8, మద్నూర్ మండలం సోమూర్‌లో 14.5, రాజంపేట మండలం ఆర్గోండ, పెద్ద కొడప్‌గల్‌లో 15.2, తాడ్వాయిలో 16.4, కామారెడ్డి కలెక్టరేట్‌లో 16.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


