కళాశాల తనిఖీ
పిట్లం(జుక్కల్): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థులకు పలు సలహాలు,సూచ నలు ఇచ్చారు.
కామారెడ్డి అర్బన్: జిల్లా పోలీసు కార్యాలయం ప్రజా సంబంధాల అధికారి(పీఆర్‌వో) జి. రాములు ఉత్తమ ప్రతిభ చూపినందుకు డీజీపీ శివధర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. హైదరాబాద్ పోలీసు శిక్షణ సంస్థలో పోలీసు పీఆర్‌వోల మూడు రోజుల శిక్షణ బుధవారం ముగిసిన సందర్భంగా డీజీ పీ నుంచి రాములు ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు.గురువారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర.. పీఆర్‌వో రాములును అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజాసేవలో, సోషల్‌మీడియా, కమ్యూనికేషన్ వ్యవస్థలో వినియోగించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
కామారెడ్డి టౌన్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆటో బోల్తా పడి విద్యార్థులు గాయపడిన ఘటనలో ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ తొలగించడం సరికాదన్నారు.
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 15న నిర్వహిస్తున్న బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని బీసీ సంఘం ప్రతినిధి పెరుక నరేష్ కోరారు. గురువారం రామేశ్వర్‌పల్లిలో సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. నేతలు వినోద్‌గౌడ్, కుడిక్యాల రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కళాశాల తనిఖీ
కళాశాల తనిఖీ


