గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తా
ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అన్నారు. ఆయన గురువారం తాడ్వాయి మండల కేంద్రంతో పాటు కృష్ణాజీవాడి, బ్రాహ్మణపల్లి, సోమారం, నందివాడ గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తాడ్వాయిలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలైన మెట్టు లావణ్య, ఆమె భర్త టీకయ్యలకు నూతన వస్ట్రాలు అందించి మిఠాయిలను తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇళ్లు నిర్మించుకునే నిరుపేదల కల నెరవేరిందన్నారు. అత్యధికంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇందిరిమ్మ ఇళ్లను మంజూరు చేశామని, తాడ్వాయి మండల కేంద్రంలో 55 ఇండ్లు మంజూరు చేయగా.. అందులో 38 ఇండ్లు వివిధఽ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే కల్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బ్రాహ్మణపల్లి, తాడ్వాయిలో అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీడీవో సాజీద్‌అలీ, నాయకులు షౌకత్‌అలీ, శివాజీ, రాజీవ్ కుమార్, ఆకిటి వెంకట్‌రాంరెడ్డి, మహేందర్‌రెడ్డి, అఖిల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
సహకార బ్యాంకు భవనం ప్రారంభం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో సహకార బ్యాంకు భవనాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల ద్వారా అన్ని రకాల రుణాలు రైతులు పొందవచ్చని అన్నారు. డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమార్, తదితరులు ఉన్నారు.
గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తా


