ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
గాంధారి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జెడ్పీ సీఈవో చందర్ నాయక్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన మండలంలో పర్యటించారు. ముందుగా పల్లెలమడుగు తండాలో రెండు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ వేయించారు. గాంధారిలో ఓ లబ్ధిదారుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయించారు. అనంతరం మండల కార్యాలయంలో ఐకేపీ, ఉపాధిహామీ సిబ్బంది, అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణ పనులను నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఎంపీడీవో రాజేశ్వర్, ఏపీఎం ప్రసన్నకుమార్, ఆయాగ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, ఉపాధిహామీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


