రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ విక్టర్
భిక్కనూరు: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ఆయన గురువారం భిక్కనూరు తహసీల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కార పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీచేయాలన్నారు.ఆయన వెంట తహశీల్దార్ సునీత, ఆర్‌ఐ బాలయ్యలు ఉన్నారు. అలాగే మండల కేంద్రంలోని ఏఎంసీ యార్డును, నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్టెక్స్ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ర మ్య, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సీఈవో రాజు, తదితరులు పాల్గొన్నారు.


