బంగారు భైరవుడికి డోలోత్సవం
● వైభవంగా కొనసాగుతున్న
కాలబైరవుడి జన్మదినోత్సవాలు
● నేడు రథోత్సవం.. అగ్నిగుండాలు
రామారెడ్డి: దేశంలో ప్రముఖ పుణ్యాక్షేత్రంగా పేరుగాంచిన ఇస న్నపల్లి(రామారెడ్డి) కాలభైరవుడి జన్మదిన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో ముఖ్యమైన ఘట్టమైన డోలారోహ ణం (తోట్లె) బుధవా రం రోజున ఘనంగా నిర్వహించారు. కాలభైరవ నామస్మరణ, లాలి పాటలతో డోలోత్సవం సాగింది. మూడు రోజులపాటు కొనసాగిన సంతతదారాభిషేకం బుధ వారం ఉదయం 6 గంటలకు ముగిసింది. మ ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సింధూర పూజ లు నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు కాలభైరవుడికి నైవేద్యం సమర్పించారు. స్వామివారి బంగారు విగ్రహాన్ని తొట్లెలో వేసి లాలిపాటలు పాడారు. ఆలయ పరిసరాలు కాలభైరవ నామస్మరణతో మారుమోగాయి. ఆలయాన్ని పూలమాలలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. గురువారం రాత్రి 3గంటల నుంచి రథోత్సవం ప్రారంభం కానుంది. స్వామివారి ఉ త్సవ విగ్రహాన్ని ఇసన్నపల్లి(రామారెడ్డి) గ్రామా లలో రథంపై ఊరేగించిన అనంతరం ఆలయానికి రథం చేరుకోగానే వీరశైవ మహేశ్వరులతో అగ్నిగుండాలు (దక్షయజ్ఞం) ప్రారంభమవుతుంది. రథోత్సవం, అగ్నిగుండాలకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్వామి సేవలో ప్రముఖులు
కాలభైరవుడి డోలారోహణం కార్యక్రమానికి నిజామాబాడ్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి హాజరయ్యారు. ఆలయ ఈవో ప్రభుగుప్తా, అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
బంగారు భైరవుడికి డోలోత్సవం
బంగారు భైరవుడికి డోలోత్సవం
బంగారు భైరవుడికి డోలోత్సవం


