పాఠశాల భవన పునర్నిర్మాణానికి రూ.కోటి విరాళం
దోమకొండ: మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన పబ్బ విజయ్‌కుమార్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పాఠశాల హెచ్‌ఎం రాధాలక్ష్మికి బాండ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చదువుకున్న పాఠశాలను తన సొంత నిధులతో పునర్నిర్మిస్తానని, భవనానికి తన తల్లిదండ్రులు పబ్బ రుక్మమ్మ, బలరామయ్య పేర్లు పెట్టాలని కోరారు. భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో తానే చేపడతానని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పన్యాల బాపురెడ్డి, శ్రీనివాస్‌శర్మ, నాయకులు పున్న లక్ష్మణ్, గుడూరి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నర్సన్నపల్లి కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని, లోడింగ్, అన్‌లోడింగ్ వెంట వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత మండలస్థాయి అధికారులు క్రమం తప్పకుండా నిత్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లించడంతోపాటు సన్న రకానికి అదనంగా క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తోందని తెలిపారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యతను పాటించాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ శశిధర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయాబీన్, మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారు.. మార్కెట్‌లో ఎన్ని క్వింటాళ్ల కాంటా చేయాల్సి ఉంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మార్క్‌ఫెడ్ పర్యవేక్షకులు చందు, సింగిల్ విండో సీఈవో సాయిలు, ఏఈవో నిఖిత తదితరులు ఉన్నారు.
పాఠశాల భవన పునర్నిర్మాణానికి రూ.కోటి విరాళం
పాఠశాల భవన పునర్నిర్మాణానికి రూ.కోటి విరాళం


